: టీవీలో వచ్చిన విన్యాసం ప్రయత్నించి.. ప్రాణాలు పోగొట్టుకున్న బాలుడు!
టీవీ కార్యక్రమాల్లో వచ్చే విన్యాసాలను నిపుణుల సమక్షంలో ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరిస్తారు, వాటిని ఇంట్లో ప్రయత్నించవద్దని చెబుతున్నా కొంతమంది పిల్లలు వినిపించుకోరు. ఆసక్తితో వాటిని ప్రయత్నించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అలాంటి విన్యాసమే ప్రయత్నించి హైదరాబాద్ లో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు.
నోట్లో కిరోసిన్ పోసుకుని మంటలు వెదజల్లే విన్యాసాన్ని మూడు రోజుల క్రితం రేపల్లె కాళీ విశ్వనాథ్ టీవీలో చూశాడు. చిన్నప్పటి నుంచి ఇలాంటి విషయాలపై ఉత్సుకతతో ఉండే కాళీ తాను కూడా నోట్లో కిరోసిన్ పోసుకుని విన్యాసం చేయడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా కిరోసిన్ ఒంటి మీద పడి మంటలు అంటుకోవడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ఆ బాలుడు మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.