: శుభాకాంక్షలు చెప్పిన ఆమిర్ ఖాన్ తో షారూక్ ఏమన్నాడంటే..!
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్-అనుష్కశర్మ జంటగా నటించిన ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా షారూక్ కు మరో అగ్రనటుడు ఆమిర్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ విజయవంతం కావాలని కోరుకున్నాడు.
ఇందుకు షారూక్ రిప్లై ఇస్తూ, ‘థ్యాంక్స్’ చెప్పడమే కాకుండా, ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ట్రైలర్ చాలా బాగుందని అన్నాడు. అంతేకాదు, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాను ఎప్పుడు చూడబోతున్నారో చెప్పమంటూ ఆమిర్ ఖాన్ ని షారూక్ అడగడం గమనార్హం.