: కూతురు కోసం 25 ఎక‌రాల్లో వందల కోట్ల వ్యయంతో థీమ్‌పార్క్‌!


పుట్టుక‌తోనే అంగ‌వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్న త‌న కూతురి కోసం రూ. 320 కోట్లు ఖ‌ర్చు పెట్టి ప్ర‌త్యేకంగా థీమ్ పార్క్ నిర్మించాడు ఆమె తండ్రి. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జోర్డాన్‌కి త‌న కూతురు మోర్గాన్ అంటే చాలా ఇష్టం. త‌న అంగ‌వైక‌ల్యం కార‌ణంగా ఇత‌ర పిల్ల‌లెవ‌రూ మోర్గాన్‌తో క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోయేవారు. ఇది చూసి జోర్డాన్ కూతురి కోసం ప్ర‌త్యేకంగా 25 ఎక‌రాల్లో థీమ్ పార్క్ క‌ట్టించాడు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి అయిన జోర్డాన్ త‌న ఆస్తి మొత్తం కూడ‌బెట్టి ఈ పార్కు క‌ట్టించాడు.

 ఇప్పుడు ఈ పార్కుకు 65 దేశాల నుంచి ప‌ర్యాటకులు వ‌స్తున్నారు. అలాగే మోర్గాన్‌తో పాటు క‌లిసి ఆడుకోవ‌డానికి చాలా మంది పిల్ల‌లు ఇక్క‌డికి వ‌స్తుండ‌టం చూసి జోర్డాన్ తెగ మురిసిపోతున్నాడు. అంతేకాదు, ఇక్క‌డ ప‌నిచేస్తున్న సిబ్బంది కూడా ప్ర‌త్యేక అవ‌స‌రాలు గ‌ల వాళ్లే. ఇలాంటి థీమ్ పార్క్ త‌మ ప్రాంతంలో కూడా నిర్మించాల‌ని జోర్డాన్‌ను ప‌ర్యాట‌కులు అడిగిన‌పుడు, ఈ పార్కు కేవ‌లం త‌న కూతురు కోస‌మే నిర్మించానని, మ‌రో చోట ఇలాంటివి నిర్మించ‌న‌ని జోర్డాన్ స‌మాధాన‌మిస్తారు.

  • Loading...

More Telugu News