: కేజీహెచ్ లో అనాథలా మృత శిశువు.. నెటిజన్ ట్వీట్ కు స్పందించిన నారా లోకేశ్!


విశాఖపట్టణంలోని కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లో ఈ రోజు ఉదయం గుండె బద్దలయ్యే ఓ సంఘటనకు తాము సాక్ష్యంగా నిలిచామంటూ ‘వైజాగ్- ది సిటీ ఆఫ్ డెస్టినీ’ అనే నెటిజన్ ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ శిశువు మృతదేహం కేజీహెచ్ లో పడేసి ఉండటం చూశామని, చాలా బాధగా ఉందంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. అయితే, సామాజిక మాధ్యమం ద్వారా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్ రవి చెరుకూరి ఈ పోస్ట్ ను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు నారా లోకేశ్, కామినేని శ్రీనివాస్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పంపారు.

‘సార్, ఇటువంటి వార్తను షేర్ చేయాల్సి రావడం చాలా విచారంగా ఉంది. ఈ సంఘటన నిజంగా జరిగి ఉంటే కనుక, దయచేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టండి’ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రవి చెరుకూరి కోరారు. ఈ ట్వీట్ కు స్పందించిన నారా లోకేశ్..‘ ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం..మరెవరకీ ఇలా జరగకూడదు. ఆరోగ్య శాఖా మంత్రిని నేను వెంటనే అప్రమత్తం చేస్తాను’ అని ట్వీట్ చేశారు. 

  • Loading...

More Telugu News