: సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ స‌ర‌స‌న భూమి ఫ‌డ్నేక‌ర్‌?


వ‌రుసగా సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న బాలీవుడ్ న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవ‌ల మ‌రో సినిమాకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే `చందా మామ దూర్ కే`, `డ్రైవ్‌` సినిమాలు ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు అభిషేక్ చౌబేతో కలసి 1970లలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చంబ‌ల్ లోయలో స్వైర విహారం చేసిన బందిపోట్ల కథాంశం నేప‌థ్యంలో నిర్మించ‌నున్న చిత్రంలో న‌టించ‌డానికి సుషాంత్ అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో సుషాంత్ స‌ర‌స‌న `ద‌మ్ ల‌గాకే హైశా` భామ భూమి ఫ‌డ్నేక‌ర్ న‌టించ‌నుంది. ఇందులో వీరిద్ద‌రూ బందిపోట్లుగానే క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన లోకేష‌న్ల ఎంపిక పూర్త‌యిన‌ట్లు, వ‌చ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు క‌థా ర‌చ‌యిత అభిషేక్ చౌబే తెలిపాడు.

  • Loading...

More Telugu News