: తండ్రిని, తల్లిని, చెల్లిని కూడా వదులుకునే వ్యక్తి జగన్: పయ్యావుల కేశవ్
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ విరుచుకుపడ్డారు. పులివెందుల రక్తచరిత్రను ఆయన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను జనజీవన స్రవంతికి దూరంగా ఉంచాలని ప్రజలను కోరారు. విపరీతమైన మనస్తత్వం కలిగిన జగన్... జనం మధ్యలో కొనసాగాల్సిన వ్యక్తి కాదని చెప్పారు. ఫ్యాక్షన్ నైజాన్ని అన్ని సందర్భాల్లో వాడుకోవాలని చూసే వ్యక్తి అని విమర్శించారు. అధికారం కోసం తండ్రిని, తల్లిని, చెల్లిని కూడా వదులుకోగల వ్యక్తి జగన్ అని అన్నారు. జైల్లో 16 నెలలు గడిపి వచ్చినా జగన్ లో పరివర్తన రాలేదని... ఆయనలో మార్పు రావాలంటూ ఇంకా ఎలాంటి జైళ్లకు పంపాలని ప్రశ్నించారు.