: ఎలుగుబంటిని ఆటపట్టించాలని చూసి, దాని చేతిలో గాయాల పాలయ్యాడు!... వీడియో చూడండి!
జూకి వెళ్లినపుడు ఎన్‌క్లోజర్‌లో ఉన్న జంతువులను బయటి నుంచి తుంటరి యువకులు వారి చేష్టలతో రెచ్చగొడుతుంటారు. కొన్నిసార్లు వారి చేష్టలు వికటించి, ఆ జంతువుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విధంగానే థాయ్‌లాండ్‌కు చెందిన నైఫం ప్రమరాటి అనే వ్యక్తి కూడా జూలో ఉన్న ఎలుగుబంటిని రెచ్చగొట్టి, ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఎలుగుకు పెట్టాల్సిన ఆహారాన్ని దానికి అందనివ్వకుండా తాడుతో వెనక్కి లాగుతూ దాన్ని ఆటపట్టించాలని ప్రయత్నించాడు.
ఎలుగుబంటికి కోపం వచ్చి తాడుతో సహా నైఫంను ఎన్‌క్లోజర్ లోపలికి లాగేసుకుంది. ఇక నోటితో రక్కుతూ నైఫంను గాయపరిచింది. బయటి నుంచి ఎంతమంది రాళ్లు, కర్రలు విసురుతూ, చల్లని నీళ్లు జల్లుతున్నా అది నైఫంను వదల్లేదు. అతన్ని నోట్లో పట్టుకుని తన బోనులోకి లాక్కెళ్లింది. చివరికి మరో వ్యక్తి బోను లోపలికి వెళ్లి దాన్ని కొట్టి నైఫంను బయటకు లాక్కొచ్చారు. తీవ్రంగా గాయపడిన నైఫం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.