: సినీ హీరోయిన్ లతో మాట్లాడే సమయం మాత్రం కేటీఆర్ కు ఉంటుంది!: టీడీపీ నేత రేవంత్ రెడ్డి
సినీ హీరోయిన్ లతో మాట్లాడే సమయం ఉన్న కేటీఆర్ కు, నేరెళ్ల బాధితులను పరామర్శించే టైమ్ లేదా? అని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కరీంనగర్ లో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు వారి బంధువులకే ఇసుక కాంట్రాక్ట్ లు ఇచ్చారని, తన ఆరోపణలు తప్పయితే తనపై కేసులు పెట్టాలని అన్నారు. నేరెళ్ల బాధితులను చిత్ర హింసలకు గురిచేసే అధికారం ఆ జిల్లా ఎస్పీకి ఎవరు ఇచ్చారు? అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నేరెళ్ల బాధితులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, ఇసుకతో వెయ్యి కోట్ల ఆదాయం వస్తే, బాధిత కుటుంబాలకు సాయం ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు నేరెళ్ల బాధితులను కేటీఆర్ పరామర్శించి ఆదుకోకపోతే, నేరెళ్లను ముట్టడించి సంగతి తేలుస్తామంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.