: తండ్రి వయసున్న చంద్రబాబును జగన్ దూషించడం దారుణం: టీజీ వెంకటేశ్
నంద్యాలలో నిన్న జరిగిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడుతూ, తండ్రి వయసున్న చంద్రబాబును జగన్ దూషించడం దారుణమని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నిన్న జగన్ పేర్కొన్న విషయమై ఆయన్ని ప్రశ్నించగా.. ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు చంద్రబాబు ఏడాది క్రితమే సుముఖత వ్యక్తం చేశారని, అయితే, ఈ కార్పొరేషన్ ను విడిగా పెట్టాలా? లేక ఓసీ కులాలను కలిపి పెట్టాలా? అనే దానిపై మేధావుల అభిప్రాయం తీసుకుంటున్నామని అన్నారు.