: అమర్యాదగా ప్రవర్తించే వారి కోసం రైల్లో దెయ్యం బొమ్మను పెట్టిన అధికారులు!
మలేషియా మెట్రో రైళ్లలో అమర్యాదగా ప్రవర్తిస్తూ, అల్లరి పనులు చేసే వారికి బుద్ధి చెప్పడానికి `అనబెల్` అనే దెయ్యం బొమ్మను అక్కడక్కడా పెట్టారు రైల్వే అధికారులు. `ప్రియమైన ప్రయాణికులారా... అప్పుడప్పుడు మన రైళ్లలో అనబెల్ దెయ్యం కనిపిస్తోంది. రైళ్లలో మర్యాదగా ప్రవర్తించకపోతే ఆమె మిమ్మల్ని వెంటాడుతుంది` అంటూ వారు రైళ్లో అక్కడక్కడ హెచ్చరికలు తెలిపే పోస్టర్లు అంటించారు.
ప్రభుత్వ సేవలను ఉపయోగించుకునే ప్రయాణికుల్లో సామాజిక ప్రవర్తనను పెంపొందించేందుకే తాము ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీరు చేసిన పనిని సోషల్ మీడియాలో చాలా మంది మెచ్చుకుంటుండగా, ఆ ఫోటోలు చూసి, అనవసరంగా పిల్లలు భయపడే అవకాశం ఉందని కొంతమంది విమర్శిస్తున్నారు.