: వచ్చే ఏడాది నుంచి పాఠ్యపుస్తకాల్లో జీఎస్‌టీ, నోట్ల రద్దు పాఠాలు
2018-19 విద్యాసంవత్సరం నుంచి పాఠ్యపుస్తకాల్లో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), నోట్ల రద్దుపై పాఠాలు పొందుపరచాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చీ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అర్థశాస్త్రం, వ్యాపార విద్య, అకౌంటెన్సీ, పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో మార్పులు చేయనున్నట్లు మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాన తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలోకి వచ్చే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, నవోదయ పాఠశాలలతో పాటు ఎన్‌సీఈఆర్‌టీ విధానం పాటించే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పాఠాలను ప్రవేశపెట్టనున్నారు.