: పట్టువదలని పెళ్లికొడుకు.... పెళ్లి కారును స్వయంగా తోసుకుంటూ వెళ్లిన వైనం... వీడియో చూడండి!
తన పెళ్లికి వరద నీరు అడ్డం కాదని నిరూపించాడు ఈ పాకిస్థానీ పెళ్లి కొడుకు. పాకిస్థాన్‌లోని పంజాబ్ జిల్లా గుజ్రాన్‌వాలా ప్రాంతంలో వరుసగా వర్షాలు కురవడంతో రోడ్ల మీద మోకాల్లోతు నీరు చేరుకుంది. ఆ నీరు ఈ పెళ్లికొడుక్కి కష్టాలు తెచ్చిపెట్టింది. చక్కగా గులాబీ పూలతో అలంకరించిన కారులో పెళ్లి బట్టల్లో మండపానికి వెళ్తున్న పెళ్లి కొడుక్కి ఈ నీరు అడ్డంకిగా మారింది. నీటిలో కారు ఇరుక్కుంది కదా! అని పెళ్లికొడుకు అధైర్యపడలేదు. తానే స్వయంగా కారును పెళ్లిమండపం వరకు నెట్టుకుంటూ తీసుకెళ్లాడు. పట్టువదలకుండా కారును తోస్తున్న పెళ్లికొడుకును వీడియోలో చూడొచ్చు.