: షర్మిల కోసమే మా అమ్మ చనిపోయిందన్న విషయాన్ని జగన్ ఎలా మర్చిపోయారు?: అఖిలప్రియ


నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి భూమా అఖిలప్రియ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల కోసం వెళ్లి, తిరిగి వస్తున్నప్పుడే తన తల్లి శోభా నాగిరెడ్డి దుర్మరణం పాలయ్యారని అన్నారు. షర్మిల కోసమే తన తల్లి చనిపోయిందన్న విషయాన్ని జగన్ ఎలా మర్చిపోయారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం వైయస్ ఫొటో పెట్టుకుని జగన్ వస్తున్నప్పుడు... తన తల్లిదండ్రుల ఫొటోను తాము పెట్టుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. శిల్పా సోదరులు తమను విమర్శించడం దురదృష్టకరమని అన్నారు. 

  • Loading...

More Telugu News