: స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏ చీర కట్టుకోమంటారు?: నెటిజన్ల సాయం కోరిన అమెరికా దౌత్యవేత్త
భారత దేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ఏ చీర కట్టుకోవాలో అర్థం కావట్లేదని, ఈ నాలిగింట్లో ఒకటి ఎంపిక చేసి పెట్టండని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలోని దౌత్యవేత్త మేరీ కే కార్ల్‌సన్ నెటిజన్లను కోరారు. తనకు బాగా నచ్చిన నాలుగు చీరలు కట్టుకుని ఫొటోలు దిగి, ఏది కట్టుకోమంటారో చెప్పమని కోరుతూ ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ చీరలు కట్టుకుని తాను నడిచిన వీడియోను కూడా మేరీ ట్వీట్ చేశారు. తాను చీరలు కొనడానికి వెళ్లినపుడు కూడా భారతీయ వస్త్రాలు తనకు బాగా నచ్చాయని వాటిని వీడియో తీసి ఆమె ట్విట్టర్‌లో పెట్టారు. ఈ విషయంలో ఆమెకు నెటిజన్లు సహాయం చేయడమే కాకుండా ఇలా భారత సంప్రదాయాన్ని గౌరవిస్తున్నందుకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.