: కోర్టుకు హాజరైన సల్మాన్ ఖాన్
అక్రమంగా ఆయుధాలను కలిగున్నాడన్న కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, నేడు జోధ్ పూర్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టుకు నేడు హాజరయ్యాడు. ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేవని సల్మాన్ పై కేసును గత జనవరిలో కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పుపై ప్రాసిక్యూషన్ అపీలుకు వెళ్లగా కేసు నేడు విచారణకు వచ్చింది. సల్మాన్ కేవలం రూ. 20 వేల విలువైన బెయిల్ బాండ్ ను దాఖలు చేసేందుకే కోర్టుకు వచ్చాడని, ఏ విధమైన హియరింగ్ లేదని ఆయన తరఫు న్యాయవాది హస్తిమల్ సారస్వత్ వెల్లడించార
కాగా కేసు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 1998లో ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్ పూర్ ప్రాంతానికి వెళ్లిన సల్మాన్ లైసెన్స్ లేని పాయింట్ 22 రైఫిల్ ను, పాయింట్ 32 రివాల్వర్ లతో సంచరించి కృష్ణజింకలను హతమార్చాడని కేసు నమోదు కాగా, సుదీర్ఘ విచారణ అనంతరం సరైన సాక్ష్యాలు లేవని, కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించిన సంగతి విదితమే.