: శిల్పా నామినేషన్ దాఖలు... భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు


నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు అభ్యర్థిగా కొద్దిసేపటి క్రితం శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం తన ఇంటి నుంచి పార్టీ నేతలు, అనుచరులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన, ఆర్డీవో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో విజయం తనదేనని, ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపిందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు.

  • Loading...

More Telugu News