: అమెరికా సెనేట్ ఉన్న‌త ప‌ద‌వుల్లో ముగ్గురు భార‌త అమెరిక‌న్ల నియామ‌కం!


డొనాల్డ్ ట్రంప్ ప‌రిపాలనా విభాగంలోని కీలక ప‌ద‌వుల్లో ముగ్గురు భార‌త అమెరిక‌న్లు నీల్ ఛ‌ట‌ర్జీ, విశాల్ అమీన్‌, కృష్ణా ఉర్సుల‌ను నియ‌మిస్తూ అమెరికా సెనేట్ ఉత్త‌ర్వులు జారీచేసింది. నీల్‌ను ఫెడ‌ర‌ల్ ఎన‌ర్జీ రెగ్యులేట‌రీ క‌మిష‌న్‌లో స‌భ్యుడిగా, విశాల్‌ను ఇంట‌లెక్చువ‌ల్ ప్రాప‌ర్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కోఆర్డినేట‌ర్‌గా, కృష్ణాను పెరూ దేశంలో అమెరికా రాయ‌బారిగా నియ‌మించారు. నిక్కీ హేలీ త‌ర్వాత అమెరికా రాయ‌బారి ప‌ద‌వి పొందిన రెండో భార‌త సంత‌తి వ్య‌క్తి కృష్ణా ఉర్సు. ప్ర‌స్తుతం నిక్కీ హేలీ ఐక్య‌రాజ్య స‌మితిలో అమెరికా రాయ‌బారిగా ప‌నిచేస్తున్నారు. విశాల్ ప‌నిచేయ‌నున్న ఇంట‌లెక్చువ‌ల్ ప్రాప‌ర్టీ విభాగంలో భార‌త్ - అమెరికాల‌కు కొన్ని విభేదాలు ఉన్నాయి. ఈయ‌న రాక‌తో వాటిలో కొన్ని స‌ద్దుమ‌ణిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News