: 6తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్లీన్ బౌల్డ్ అయిన అశ్విన్


మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌ లో భాగంగా కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో భారీ స్కోరు దిశగా సాగుతున్న టీమిండియా, వికెట్లను కూడా కోల్పోతోంది. లంచ్ విరామం తరువాత 92 బంతుల్లో 54 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్ అవుట్ అయ్యాడు. 48 పరుగుల వద్ద అశ్విన్ భారీ సిక్స్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, ఆపై వెంటనే హెరాత్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సాహా 18 పరుగులతో క్రీజులో ఉండగా, హార్దిక్ పాండ్యా వచ్చి జతకలిశాడు. భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 451 పరుగులు.

  • Loading...

More Telugu News