: జగన్ పై రాజద్రోహం కేసు నమోదు చేయాలి: టీడీపీ నాయకురాలు అనూరాధ
సాక్షాత్తు ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు జగన్ వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకురాలు అనురాధ మాట్లాడుతూ, జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్ పై రాజద్రోహం కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నడిరోడ్డుపై జనాలను కాల్చి చంపడమనేది జగన్ కు వారసత్వంగా వచ్చిన లక్షణమని అన్నారు. చంద్రబాబుకు జగన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.