: విజయవాడలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం
ముఖ్యమంత్రి చంద్రబాబును కాల్చి చంపాలని పిలుపునిచ్చిన వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఈ రోజు విజయవాడలో ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్న జగన్ ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత దేవినేని అవినాశ్ మాట్లాడుతూ జగన్ పై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇవ్వాల్సిన జగన్... తన హోదాను మరచి 'చంపాలి, నరకాలి' అంటూ వ్యాఖ్యానిస్తుండటం దురదృష్టకరమని అన్నారు.