: నైజీరియన్లతో కలసి దందా నడిపిన 'డ్రగ్ లేడీ డాన్' విజయవాడ సంగీత అరెస్ట్
మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ, లేడీ డాన్ గా పేరు తెచ్చుకున్న విజయవాడ యువతి సంగీతను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్లతో సంబంధాలు పెట్టుకుని, వారితో కలసి తిరుగుతూ, వ్యభిచార గృహం కూడా నిర్వహించిన సంగీతను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అమ్మాయిల నగ్న దృశ్యాలు సేకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసేదని, ప్రియుడు సోమాయిల్ జాన్ తో కలసి డ్రగ్స్ వ్యాపారం చేసిందని తేల్చారు.
శివారు ప్రాంతంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు స్వయంగా మత్తుమందులను విక్రయించేదని, వారిని తన ఇంటికి ఆహ్వానించి, అమ్మాయిలను సరఫరా చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆమె ఉచ్చులో బంజారాహిల్స్ కు చెందిన ప్రముఖుల పిల్లలున్నారని గుర్తించినట్టు తెలిపాయి. ఈ విషయంలో ఆరుగురు వ్యాపారుల పిల్లలను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.