: జగన్ పై చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎస్పీకి ఫిర్యాదు చేసిన జడ్పీ ఛైర్మన్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎస్పీకి జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సీఎంపై జగన్ వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. అవాస్తవాలు మాట్లాడిన జగన్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తూ కాల్చి చంపాలని వ్యాఖ్యానించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి.