: భరణం కోసమే అర్బాజ్‌కు విడాకులిచ్చింది... మలైకా అరోరాపై నెటిజన్ల కామెంట్!
విడాకులివ్వడం ద్వారా వచ్చే భరణం కోసమే కోటీశ్వరుడైన అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుని వదిలించుకుందని బాలీవుడ్ నటి మలైకా అరోరాపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను మలైకా 1998లో వివాహం చేసుకుంది. ఇటీవల వీరిద్దరికి ముంబై కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ మధ్య మలైకా తన ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన ఫొటోకు `మాజీ భర్త ఇచ్చిన భరణంతో దుస్తులు కొనుక్కుని ఎంజాయ్ చేస్తుంది` అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
దీన్ని ఆసరాగా తీసుకుని మిగతా నెటిజన్లు భరణం కోసమే కోటీశ్వరుడైన అర్బాజ్‌ను పెళ్లి చేసుకుని, విడాకులిచ్చిందని ఆరోపించడం మొదలుపెట్టారు. సాధారణంగా ఇలాంటి కామెంట్లను పట్టించుకోని మలైకా, నెటిజన్ల కామెంట్లు మితిమీరుతుండటంతో ఆమె తనదైన శైలిలో బదులు చెప్పింది. `ఇతరుల జీవితం గురించి నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం తప్ప మీకు ఏం తెలీదు. దమ్ముంటే మీ ఆరోపణలను రుజువు చేయగలరా? ఇలాంటి విషయాల్లో కల్పించుకుని మీ సమయం వృథా చేసుకోకండి` అని మలైకా సమాధానమిచ్చింది. మలైకా, అర్బాజ్‌లకు 14 ఏళ్ల కుమారుడు అర్హాన్ ఉన్నాడు.