: 10,049 టికెట్లను లక్కీ భక్తులకు అందించనున్న టీటీడీ
నవంబర్ నెల తిరుమల శ్రీనివాసుని ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. లక్కీ డిప్ కింద 10,049 టికెట్లను ఉంచినట్టు తెలిపింది. సుప్రభాతం 7,269, తోమాల సేవ 120, అర్చన 120, అష్టదళం 240, నిజపాద దర్శనం 2,300 సేవా టికెట్లను నమోదు చేయించుకున్న భక్తుల్లో లక్కీ విజేతలకు అందించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ టికెట్లను పొందాలని భావించే వారు 11వ తేదీ ఉదయం 10 గంటలలోగా రిజిస్టర్ చేసుకోవాలని, అదే రోజు 12 గంటలకు డ్రా తీసి టికెట్లను అందిస్తామని, టికెట్లు పొందిన వారు 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా డబ్బు చెల్లించాల్సి వుంటుందని వెల్లడించారు. కాగా, వీటికి అదనంగా రెగ్యులర్ ఆన్ లైన్ బుకింగ్ కింద కల్యాణోత్సవం 10,875, ఊంజల్ సేవ 2,900, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,234, వసంతోత్సవం 12,470, సహస్ర దీపాలంకార సేవ 13,775, విశేషపూజ 1,500 టికెట్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.