: నా గాడ్ ఫాదర్ దిల్ రాజు...అందుకే మూడు సినిమాలకు ఓకే చెప్పేశాను: సాయి పల్లవి


దిల్ రాజు బ్యానర్ లో పని చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని సాయిపల్లవి తెలిపింది. ఫిదా సినిమాలో భానుమతిగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సాయిపల్లవి శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాల్లో పని చేసేందుకు సిగ్నల్ ఇచ్చేసిందట. దీనిపై ఆమెను ప్రశ్నించడంతో... తనకు దిల్ రాజు గాడ్ ఫాదర్ అని చెప్పింది. అందుకే ఆయన బ్యానర్ లో వరుసగా మూడు సినిమాల్లో పని చేసేందుకు అంగీకరించానని చెప్పింది.

నానితో ఒక సినిమాలో నటించబోతున్నానని, దాని తరువాత మరో సినిమాలో నటించనున్నానని, ఇంకోటి ఇంకా ఫైనల్ కావాల్సి ఉందని చెప్పింది. తనకు సినిమాలంటే ఇష్టం ఉన్నా, తన తండ్రి కార్డియాలజిస్టు కావాలని కోరుకున్నారని చెప్పింది. కొద్ది కాలం సినిమాల్లో నటించి బుద్ధిగా కార్డియాలజిస్టు అవుతానని చెప్పింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏదిపడితే అది అంగీకరించలేనని తెలిపింది. కథ నచ్చితే స్టార్ హీరోలున్నా లేకున్నా ఫర్వాలేదని తెలిపింది. 

  • Loading...

More Telugu News