: తాగిన మ‌త్తులో లోయ‌లో ప‌డిన యువ‌కులు... వీడియో చూడండి!


మ‌హారాష్ట్ర‌లోని ప్ర‌ఖ్యాత సంద‌ర్శ‌న స్థ‌లం అంబోలి ఘాట్ వ‌ద్ద ఇద్ద‌రు యువ‌కులు మ‌ద్యం మ‌త్తులో 2,000 అడుగుల లోతు ఉన్న లోయ‌లో ప‌డిన వీడియో ఇంట‌ర్నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ఘ‌ట‌న సోమ‌వారం సాయంత్రం కావ‌లే సాద్ పాయింట్ బ్రిడ్జి వ‌ద్ద జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. యువ‌కులను ఇమ్రాన్ గ‌రాదీ, ప్ర‌తాప్ రాథోడ్‌గా పోలీసులు గుర్తించారు. భారీ వ‌ర్షం కార‌ణంగా మృత‌దేహాల వెలికితీత క‌ష్టంగా ఉంద‌ని పోలీసు అధికారి సునీల్ ధ‌న‌వాడే తెలిపారు.

కొల్హాపూర్ నుంచి ఏడుగురు స్నేహితుల‌తో క‌లిసి ఈ యువ‌కులు విహార‌యాత్ర‌కు వ‌చ్చిన‌ట్లు ధ‌న‌వాడే చెప్పారు. మిగ‌తా స్నేహితులు వెళ్లిపోగా న‌లుగురు మాత్రం ఇక్క‌డే ఉండిపోయార‌ని, మ‌ద్యం మ‌త్తులో బ్రిడ్జి మీద విన్యాసాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని, ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా లోయ‌లో ప‌డిపోయార‌ని ఆయ‌న వివ‌రించారు. వీరి మృత‌దేహాల జాడ తెలుసుకోవ‌డానికి హిల్ రైడ‌ర్స్‌ను, ప‌ర్వ‌తారోహ‌కుల‌ను రంగంలోకి దించారు. వారి ఆచూకీ తెలిసినా వ‌ర్షం కార‌ణంగా వెలికితీత క‌ష్టంగా మారింద‌ని ధ‌న‌వాడే అన్నారు.

  • Loading...

More Telugu News