: వైసీపీలో చేరనున్న నటి హేమ!
సినీ నటి, కాపు సామాజిక వర్గం మహిళా నేతగా పేరు తెచ్చుకున్న హేమ త్వరలోనే వైకాపాలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే స్పష్టం చేశారు. హేమను పార్టీలో చేరాలని గతంలోనే తాము ఆహ్వానించామని తెలిపారు. అయితే, పార్టీలో ప్రధాన మహిళా నేతగా ఉన్న రోజాకు చెక్ చెప్పేందుకు హేమను ఆహ్వానించినట్టు వచ్చిన వార్తలు మాత్రం అవాస్తవమని పార్టీ నేత ఒకరు వెల్లడించారు. త్వరలోనే వైఎస్ జగన్ సమక్షంలో హేమ పార్టీలో చేరుతారని ఆయన అన్నారు. కాగా, హేమ గతంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.