: దుబాయ్ లోని 'టార్చ్ టవర్'లో భారీ అగ్నిప్రమాదం... 84వ అంతస్తులో మంటలు!


ఆకాశహర్మ్యాలకు నెలవైన దుబాయ్ లోని ఓ భారీ భవంతిలో అగ్నిప్రమాదం సంభవించింది. 676 డబుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్లతో పాటు షాపింగ్ మాల్ లు, ధీమ్ పార్కులకు నెలవైన టార్చ్ టవర్ ప్రపంచంలోనే 32వ ఎత్తైన భవంతిగా వినుతికెక్కింది. ఈ భవంతిలోని 84వ అంతస్తులో మంటలు చెలరేగాయని సమాచారం. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భవనంలోని అందర్నీ ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. వేగంగా స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News