: మలయాళ హీరో దిలీప్ ఎపిసోడ్ లో కొత్త కోణం... దిలీప్ కు మూడు పెళ్లిళ్లు!


హీరోయిన్ భావన రేప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న స్టార్ హీరో దిలీప్ పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు మలయాళ సినీ పరిశ్రమ షాకయ్యే విషయాన్ని వెల్లడించారు. దిలీప్ మొదటి భార్య మంజు వారియర్ అని, రెండో భార్యగా కావ్య నాయర్ ను వివాహం చేసుకున్నాడని ఇంత కాలం మాలీవుడ్ భావిస్తూ వస్తోంది. అయితే దిలీప్ కు మూడు వివాహాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. మంజు వారియర్ దిలీప్ రెండో భార్య అని, కావ్య నాయర్ దిలీప్ మూడో భార్య అని వారు తేల్చి చెప్పారు. దిలీప్ మొదటి భార్య దుబాయ్ లో ఉంటోందని, ఆమెకు విడాకులు ఇవ్వకుండానే దిలీప్ మంజు వారియర్ ను వివాహం చేసుకున్నాడని వారు తెలిపారు.  

  • Loading...

More Telugu News