: 'వాడు నీచుడు.. కఠినంగా శిక్షించాలని' డిమాండ్ చేస్తూ బంద్ పాటించిన హిందూత్వ సంఘాలు!


ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ సమీపంలోని సత్పులి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. సత్పులి పట్టణంలో ఫర్నిచర్ షాపు నడుపుతున్న 23 ఏళ్ల యువకుడు కామంతో కళ్లు మూసుకుపోయి గోవుతో శృంగారం చేశాడు. ఇది తెలియడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఏబీవీపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశాయి. ఆ పట్టణంలో బంద్ కు పిలుపునిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ను ఘొరావ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించి బంద్ పాటించారు. దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని, ఐపీసీ సెక్ష 377 కింద కేసు నమోదు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించారు. 

  • Loading...

More Telugu News