: ఇన్‌స్టాగ్రామ్‌లో పడి కొట్టుకుపోతున్న యువత.. రోజుకు 32 నిమిషాలు అందులోనే!


ఫేస్‌బుక్‌కు చెందిన ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పడి యువత కొట్టుకుపోతోందని తేలింది. 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువత రోజుకు 32 నిమిషాలు ఇన్‌స్టాగ్రామ్‌లోనే గడుపుతున్నట్టు కంపెనీ పేర్కొంది. 25 ఏళ్లు పైబడిన వారు మాత్రం రోజుకు 24 నిమిషాలు అందులో గడుపుతున్నారని తెలిపింది. ఈ యాప్‌లో యూజర్లు కొద్ది నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే 24 గంటల తర్వాత అవి యాప్ నుంచి మాయమవుతాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ను రోజుకు 25 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. తాజా గణాంకాలు స్నాప్‌చాట్‌కు షాకిచ్చాయి. దీనికి 16.6 కోట్ల మంది వినియోగదారులున్నారు. కాగా, తొలి త్రైమాసికంలో స్నాప్‌చాట్‌లో యూజర్లు రోజుకు 30 నిమిషాలు గడిపినట్టు తేలింది.

  • Loading...

More Telugu News