: ఇంగ్లిష్ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని.. క్లాస్‌రూమ్‌లో బాలికల దుస్తులు విప్పించిన టీచర్!
ఇంగ్లిష్ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయన్న కోపంతో తరగతి గదిలోనే ఇద్దరు బాలికల దుస్తులు విప్పించిందో టీచర్. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ పట్టణంలోని ఓ ప్రైవేటు సెకండరీ స్కూల్‌లో జరిగిందీ ఘటన. ఆరో తరగతి విద్యార్థులకు పెట్టిన ఇంగ్లిష్ పరీక్షలో ఇద్దరు బాలికలకు తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో తొలుత వారిని మందలించిన ఉపాధ్యాయురాలు, అనంతరం తరగతిలో తోటి విద్యార్థుల ముందే వారి టాప్స్ విప్పించింది. బాధిత విద్యార్థులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూలుకు చేరుకుని ఆందోళన చేశారు. విషయం తెలిసిన పోలీసులు వారికి నచ్చజెప్పి టీచర్‌పై సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు. దీని ప్రకారం నేరం రుజువైతే టీచర్‌కు ఏడాది జైలు శిక్ష, జరిమానా, లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది.