: కొన్ని అసలు మారవు.. నా ప్రేమ కూడా ఎప్పటికీ ఇలానే ఉంటుంది: సినీ నటి రాధిక


దక్షిణాదికి చెందిన సీనియర్ నటి రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే, తన నటనా కౌశల్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రాధిక పలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించిన రాధిక, రాడాన్ అనే సంస్థ ద్వారా పలు టీవీ సీరియల్స్ కూడా నిర్మిస్తోంది. ఇంతకీ, అసలు విషయమేమిటంటే.. తన కూతురు చిన్నారి రయానెతో కలిసి కొన్నేళ్ల క్రితం దిగిన ఓ ఫొటోను, రయానె పెరిగి పెద్దయిన తర్వాత తాజాగా దిగిన మరో ఫొటోను రాధిక పోస్ట్ చేసింది.

ఆ ఫొటోల ప్రత్యేకత ఏంటంటే.. చిన్నారి రయానెను ముద్దాడుతున్న ఫొటో ఒకటి కాగా, రయానె పెళ్లి వేడుకలో ఆమెను ప్రేమగా రాధిక ముద్దుపెట్టుకుంటున్న ఫొటో మరోటి. ఈ రెండు ఫొటోలను పోస్ట్ చేసిన రాధిక, ‘కొన్ని అసలు మారవు. నా ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉంటుంది’ అని తన ట్వీట్ లో పేర్కొంది. కాగా, గత ఏడాది ఆగస్టులో రయానె వివాహం క్రికెటర్ అభిమన్యు మిథున్ తో జరిగింది.  

  • Loading...

More Telugu News