: ఇకపై నాకు నేనే మేనేజర్ ని!: హీరోయిన్ కాజల్
డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ హీరోయిన్ కాజల్ మేనేజర్ రోనీని పోలీసులు ఇటీవల అరెస్టు చేయడం, అతని వ్యక్తిగత విషయాల గురించి తనకు తెలియదని ఆమె చెప్పడం తెలిసిందే. తాజాగా, కాజల్ స్పందిస్తూ, ఇకపై, తనకు తానే మేనేజర్ గా వ్యవహరిస్తానని, ఎవరినీ మేనేజర్ గా నియమించుకోనని చెప్పింది. అయితే, ఒక సహాయకుడిని మాత్రం నియమించుకుంటానని, కథలు, పారితోషికం వంటి విషయాలను ఇకపై తానే చూసుకుంటానని కాజల్ తెలిపింది. కాగా, కాజల్ తో పాటు మరికొందరు హీరోయిన్లకు కాల్ షీట్స్ వ్యవహారాలను కూడా రోనీ చూసుకునేవాడు. డ్రగ్స్ వ్యవహారంలో రోనీ అరెస్టు కావడంతో ఆ పోస్ట్ నుంచి అతన్ని కాజల్ పక్కనపెట్టింది.