: చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చాలన్న జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సోమిరెడ్డి
చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చాలంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు సబబు కాదంటూ ఆయన విరుచుకుపడ్డారు. నంద్యాల ఉపఎన్నిక కోసం మంత్రులందరూ రోడ్లపై తిరుగుతారన్న జగన్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇస్తూ.. తమకేమీ కొమ్ములు రాలేదని, ప్రచారం నిమిత్తం రోడ్లపై తిరుగుతామని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా స్క్రిప్ట్ లు చదువుతోందని, ఉపఎన్నికను వైసీపీ డబ్బుమయం చేస్తోందని, శిల్పా సోదరులను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చేసింది టీడీపీయేనని అన్నారు.