: కువైట్ ఎన్ఆర్ఐ బాలుడి దాతృత్వం.. భారత ఆర్మీ సంక్షేమ నిధికి విరాళం!


కువైట్ కు చెందిన చెందిన ఓ ఎన్ఆర్ఐ బాలుడు భారత ఆర్మీపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ సంక్షేమ నిధికి రూ.18,000 చెక్కును బహూకరించాడు. ఈ చెక్కును స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశాడు. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఓ ట్వీట్ ద్వారా తెలిపింది.

కువైట్ కు చెందిన రిథిరాజ్ కుమార్ అనే బాలుడు మోదీని కలిసి, భారత ఆర్మీ సంక్షేమనిధి నిమిత్తం ఈ చెక్కును ఆయనకు స్వయంగా అందజేసినట్టు పేర్కొంది. ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ టెస్ట్ ఫర్ ఇంప్రూవింగ్ లెర్నింగ్ అవార్డు ఫర్ ఎక్స్ లెన్స్ కింద ఈ మొత్తాన్ని రిథిరాజ్ సాధించాడని, దానిని తిరిగి భారత ఆర్మీ సంక్షేమ నిధికి అందజేశాడని తెలిపింది. ఈ సందర్భంగా మోదీకి రిథిరాజ్ చెక్కును అందజేస్తున్న సందర్భంలో తీసిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News