: మమ్మల్ని గెలిపిస్తే.. నంద్యాలను మోడ్రన్ టౌన్ గా తీర్చిదిద్దుతా: వైఎస్ జగన్


ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కనుక నంద్యాలను మోడ్రన్ టౌన్ గా తీర్చిదిద్దుతామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే 13 జిల్లాల ఏపీని 25 జిల్లాల రాష్ట్రంగా మారుస్తామని, నంద్యాలను జిల్లాగా చేస్తామని, ఆ జిల్లాకు హెడ్ క్వార్టర్ గా నంద్యాలనే ఉంచుతామని, నంద్యాలలో వ్యవసాయ యూనివర్శిటీ నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.

నంద్యాల ప్రజల ఆశీస్సులు రేపటి తమ విజయానికి పునాదులు కావాలని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితులందరికీ న్యాయం చేస్తామని, ఆర్యవైశ్య సోదరులకు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని 2018లో వైసీపీకి వచ్చే ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటును నంద్యాల ముస్లింకు కేటాయిస్తానని అక్కడి ప్రజలకు జగన్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News