: భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆసియా మార్కెట్లు ప్రతికూల ప్రభావం చూపడంతో దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 239 పాయింట్లు పతనమై 32,238కు పడిపోయింది. నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 10,014కు జారుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇవాల్టి టాప్ గెయినర్స్... ఫోర్టిస్ హెల్త్ కేర్ (6.99%), బాటా ఇండియా (6.61%), ఎడిల్ వీస్ ఫిన్ సర్వ్ (5.17%), వీడియోకాన్ (4.87%), గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ (4.84%).
టాప్ లూజర్స్... జిందాల్ స్టీల్ అండ్ పవర్ (-10.09%), యూనిటెక్ (-8.88%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-7.78%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (-5.98%), కమిన్స్ ఇండియా లిమిటెడ్ (-5.33%).