: గిప్పుడే ‘ఫిదా’ చూసినా..మస్తుగుంది!: హీరో నాని


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్-సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’. ఈ చిత్రం బాగుందంటూ ఇప్పటికే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో నాని ఓ ట్వీట్ చేశాడు. ‘గిప్పుడే ‘ఫిదా’ చూసినా.. మస్తుగుంది. సాయిపల్లవి మ్యాజిక్ చేసింది. వరుణ్ తేజ్ పర్ఫెక్ట్. శేఖర్ గారు, మీ చిత్రాల్లో నా ఫేవరెట్ సినిమా ఇది’ అని నాని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం ఫిదా. ఈ చిత్రంలో సాయిపల్లవి, వరుణ్ తేజ్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

  • Loading...

More Telugu News