: `నేనే రాజు నేనే మంత్రి` ప్రచార వేడుకలో బిత్తిరి సత్తి హల్‌చల్!
తనదైన మాటతీరుతో బాగా ప్యాపులర్ అయిన బిత్తిరి సత్తి హైదరాబాదులో జరిగిన `నేనే రాజు నేనే మంత్రి` ప్రచార వేడుకలో హల్ చల్ చేశాడు. ఎప్పటికప్పుడు కౌంటర్లు, పంచ్‌లు వేస్తూ హాజరైన వారందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు. ముఖ్యంగా ఆ సినిమా హీరోయిన్లు కాజల్ అగర్వాల్, కేథరిన్ త్రెసాలను సత్తి ఆటపట్టించిన విధానం అందరికీ నచ్చింది. బిత్తిరి సత్తి మాట్లాడుతున్న ఇంగ్లిషు అర్థం కాక కాజల్ బిత్తర చూపులు చూసింది.
తర్వాత ఐటమ్ సాంగ్స్ గురించి సత్తి అడిగిన ప్రశ్నలకు కాజల్‌కు ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాజల్ మీద సత్తి మరికొన్ని పంచ్‌లు వేయబోతుండగా ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న రానా, సత్తి పంచ్‌లకు బ్రేక్‌లు వేశాడు. తర్వాత కేథరీన్ విషయంలోనూ సత్తి తన టాలెంట్ చూపించాడు. `నువ్వు ఫుడ్ సప్లై చేస్తావా? మరెందుకు కేటరింగ్ అని పేరు పెట్టుకున్నావ్?`, `ఎప్పుడూ సెకండ్ హీరోయిన్‌గానే ఎందుకు చేస్తున్నావ్?`, `సినిమాలో సిగరెట్ తాగి ముకేశ్ లాగ అయిపోయావ్!` అంటూ తనదైన చేష్టలతో సత్తి అందరినీ నవ్వించాడు. సత్తి మాట్లాడినప్పుడల్లా వేడుకకు హాజరైన అభిమానులు పెద్దగా చప్పట్లు కొట్టడం, అరవడం చేశారు.