: లైవ్ కవరేజ్ లో రిపోర్టర్ దవడ పగలగొట్టాడు!
లైవ్ కవరేజ్ లో ఉన్న ఓ రిపోర్టర్ దవడను ఓ వ్యక్తి పగలగొట్టిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, మాస్కోలో జరుగుతున్న పారాట్రూపర్స్ డే సెలబ్రేషన్స్ ను కవర్ చేయడానికి రష్యాకు చెందిన ఎన్టీవీ రిపోర్టర్ నికిట రజ్వోజ్యయేవ్ వెళ్లాడు. ఈ సందర్భంగా ఆయన లైవ్ లో మాట్లాడుతుండగా... ఆయన పక్కకు 32 ఏళ్ల దిమిత్రీ ఓర్లోవ్ అనే వ్యక్తి వచ్చాడు. అంతేకాదు, 'ఇది మా దేశం. ఉక్రెయిన్ ను ఆక్రమిస్తాం' అంటూ గట్టిగా అరిచాడు. దీంతో, మాట్లాడవద్దని రిపోర్టర్ కోరాడు. అంతే... నన్ను అలా మాట్లాడవద్దని చెప్పడానికి నీవెవరివి? అంటూ దవడపై ఓ పంచ్ ఇచ్చాడు. ఈ ఘటనలో నికిట తీవ్రంగా గాయపడ్డాడు. అతని దవడ ఫ్రాక్చర్ అయింది. పోలీసులు ఓర్లోవ్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.