: రాహుకేతు పూజలు చేయించుకున్న టాలీవుడ్ భామ!
హీరోయిన్ ప్రణీత ఈ రోజు శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. ఆలయం వద్ద ఆమెకు దేవాలయ సిబ్బంది స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆమె రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకుంది. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకుంది. దర్శనం అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆమెకు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.