: పసుపు రైతుల సంక్షేమం గురించి ప్రధానిని కలిసిన కవిత
దేశంలో పసుపు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని కోరినట్లు ఎంపీ కవిత తెలిపారు. ఇతర ఎమ్మెల్యేలతో కలిసి తాను ప్రధాని మోదీని కలిసిన విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. `గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, దేశంలోని పసుపు రైతుల సంక్షేమం కోసం నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరాం` అని కవిత ట్వీట్‌లో పేర్కొన్నారు.