: కర్నూలులో ఆగిన జగన్... గౌరు వెంకట్ రెడ్డి ఇంట భోజనం!
నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి నంద్యాలలో జరిగే వైకాపా బహిరంగ సభలో పాల్గొనేందుకు ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్, కర్నూలులో భోజన విరామం నిమిత్తం ఆగారు. పార్టీ నేత గౌరు వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లిన జగన్, అక్కడే భోజనం చేసి, ఆపై నంద్యాలకు బయలుదేరనున్నారు. హైదరాబాద్ నుంచి జగన్ వెంట భారీ కాన్వాయ్ నంద్యాలకు వెళుతుండగా, వీరందరికీ వెంకట్ రెడ్డి భోజన ఏర్పాట్లను చేసినట్టు పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. కాగా, మధ్యాహ్నం తరువాత జరిగే సభలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్న సంగతి తెలిసిందే.