: తనను తాను కాల్పించుకున్న విక్రమ్ గౌడ్ డిశ్చార్... ఆపై క్షణాల్లో అరెస్ట్


ఈ ఉదయం అపోలో ఆసుపత్రి నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ డిశ్చార్జ్ కాగా, ఆపై క్షణాల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. సానుభూతి, తండ్రి నుంచి డబ్బు కోసం తనను తాను సుపారీ ఇచ్చి కాల్పించుకున్న విక్రమ్ గౌడ్, పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడని చెబుతూ, డాక్టర్లు కొద్దిసేపటి క్రితం డిశ్చార్జ్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు, అరెస్ట్ ను ప్రకటించగానే, తన వెన్నులో బులెట్ ఉందని, నడవలేనని విక్రమ్ చెప్పడంతో, వీల్ చైర్ లోబయటకు తరలించి, ఆపై పోలీస్ జీపులోనే నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. విక్రమ్ ను ఆంబులెన్స్ లో స్టెచ్చర్ పై తీసుకెళ్తే, ఆరోగ్యం బాగాలేదని కోర్టు అభిప్రాయపడి, మరి కాసేపట్లో అరెస్టును ఆపవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఈ కారణంతోనే వైద్యులు ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం, ఆయన మెడికల్లీ ఫిట్ గా ఉన్నారని చెబుతూ, జీపులో కోర్టుకు తీసుకెళ్లారు. మరికాసేపట్లో న్యాయమూర్తి ముందు విక్రమ్ ను హాజరు పరిచి కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News