: కేటీఆర్ ట్విట్టర్ రిక్వస్ట్.. పింఛన్ అందుకున్న మహిళ!


లంచం ఇవ్వ‌నందుకు పింఛ‌ను ఆపేశార‌ని మౌన పోరాటం చేసిన వృద్ధురాలికి ఫించ‌న్ వ‌చ్చేలా చేశారు మంత్రి కేటీఆర్‌. వికారాబాద్ జిల్లా కొడంగ‌ల్ మండ‌లం రుద్రారం గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు బిజాన్ బీ, లంచం ఇవ్వనందుకు అధికారులు పింఛ‌ను ఇవ్వ‌డం లేద‌ని చెట్టుకింద ప్లకార్డు ప‌ట్టుకొని మౌన‌దీక్ష చేసింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా కేటీఆర్‌కు తెలిసేలా చేశారు ఆ ఊరి యువ‌కులు.

దీనిపై స్పందించి వెంట‌నే విచార‌ణ జ‌ర‌పాలని, సంబంధిత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వికారాబాద్ క‌లెక్ట‌ర్‌ను ట్విట్ట‌ర్‌లో కేటీఆర్‌ కోరారు. దీనికి స‌మాధానంగా తాండూర్‌ స‌బ్‌క‌లెక్ట‌ర్ బిజాన్ బీని సంద‌ర్శించి, ఆమెకు రావాల్సిన రూ. 15,000 పింఛ‌ను బకాయి చెక్కును అంద‌జేసిన సంగ‌తిని వికారాబాద్ క‌లెక్ట‌ర్, కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఈ విష‌యాన్ని కేటీఆర్ షేర్ చేస్తూ `ఇది నిజంగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌నే` అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News