: 'కోహ్లీ కంటే వారిద్దరే ఎంతో గొప్ప' అంటున్న పాకిస్థాన్ మాజీ దిగ్గజం!


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లే గొప్ప బ్యాట్స్ మన్లు అని పాకిస్థాన్ మాజీ దిగ్గజ ఆటగాడు యూసుఫ్ యొహానా అలియాస్ మహ్మద్ యూసుఫ్ తెలిపాడు. పరుగుల మెషీన్ గా పేరొందిన కోహ్లీ ఇంకా వారి స్థాయికి చేరలేదని అన్నాడు. సచిన్, ద్రావిడ్ లు ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ బౌలింగ్ ను ఎదుర్కొన్నారని చెప్పాడు. మెక్ గ్రాత్, షేన్ వార్న్, అలెన్ డొనాల్డ్, ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్, వాల్ష్, ఆంబ్రోస్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ వంటి నాణ్యమైన బౌలర్లను గుర్తు చేసుకున్నాడు.

అంత నాణ్యమైన పేసర్లు, స్పిన్నర్లు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించాడు. అప్పుడు పిచ్ లను అనుకూలంగా మార్చుకోవడం అన్న విధానం తెలియదని చెప్పాడు. పిచ్ ఎలా ఉన్నా ఆడేవారని యూసుఫ్ గుర్తు చేశాడు. ఇప్పుడలా కాదని, ఫ్రెండ్లీ పిచ్ లు తయారు చేస్తున్నారని తెలిపాడు. బ్యాట్స్ మన్ కు అనుకూలంగా పిచ్ లు ఉంటున్నాయని చెప్పాడు. కోహ్లీ కనీసం వీవీఎస్ లక్ష్మణ్ స్థాయికి కూడా చేరలేదని యూసుఫ్ అభిప్రాయపడ్డాడు. దీంతో కోహ్లీని వారితో పోల్చకూడదని హితవు పలికాడు. 

  • Loading...

More Telugu News