: 'పప్పు'గాడినే అయితే ఇవన్నీ చేయగలుగుతానా?: నారా లోకేష్


నారా లోకేష్ అంటే 'ఆంధ్రా పప్పు' అన్న బ్రాండ్ వేసి ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించిన వేళ, ఆయన స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కార్యకర్తల కోసం ఎన్నో చేశానని వెల్లడించిన ఆయన, "2014-16లో ఎవరూ ఊహించని విధంగా 50 లక్షల మందిని క్రియాశీలక సభ్యులుగా తెలుగుదేశం పార్టీలో చేర్పించాను. 2016-18లో 70 లక్షల మంది కార్యకర్తలను చేర్పించాను. అదే విధంగా దాదాపు 2 వేల కుటుంబాలు... ఏదైతే తెలుగుదేశం కార్యకర్తగా ఉండి ప్రమాదవశాత్తూ మరణించారో వారి కుటుంబాలను ఆదుకున్న వ్యక్తిని నేను.

మా ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారానే... ఈరోజు నేను ఎవరూ ఊహించని విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తి చేస్తున్నాం. 40 లక్షల వీధి దీపాలు పెడుతున్నాం. ఇవన్నీ నేను నిజంగానే... పప్పోడే చేయగలిగితే పప్పు... ఉప్పోడు చేయగలిగితే ఉప్పోడో అవుతాడు" అన్నారు. గూగుల్ సెర్చ్ లో 'ఏపీ పప్పు' అని కొడితే లోకేష్ పేరు వస్తుందన్న విషయమై స్పందిస్తూ, 'చేయనియ్యండి... దాని కన్నా ఇంకేమీ చేయలేరు. రెండు ఆర్టికల్స్, ప్రోగ్రాములు చేస్తారు. నేనేం చేస్తానో ప్రజలకు తెలుసు' అని చెప్పారు. సోషల్ మీడియా ప్రచారాన్ని తాను పట్టించుకోబోనని అన్నారు. 

  • Loading...

More Telugu News