: 'చిట్టి గురువు'లను చూసి.. కంటతడి పెట్టిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు!


కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు భావోద్వేగానికి లోనై, కంటతడి పెట్టారు. విజయనగరం జిల్లాలోని ద్వారంపూడి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా, గ్రామంలోని పాఠశాలకు ఆయన వెళ్లారు. అక్కడ... తమ తల్లిదండ్రులకు చదవడం, రాయడం నేర్పుతున్న విద్యార్థినులను చూసిన ఆయన చలించిపోయారు. ఎంతో ఆనందానికి గురయ్యారు. ఆయన కళ్ల నుంచి ఆనందబాష్పాలు పెల్లుబికాయి. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ, ప్రధాని మోదీ కూడా 'చిట్టి గురువులు' గురించి మాట్లాడారని తెలిపింది. అనంతరం గ్రామంలో అశోక్ గజపతిరాజు మొక్కలను నాటారు. ఆ తర్వాత గ్రామస్తులతో ముచ్చటిస్తూ, గ్రామ సమస్యల గురించి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News