: బాలకృష్ణ '102'వ సినిమా మొదలైంది!


నందమూరి నటసింహం బాలకృష్ణ, 102వ చిత్రం షూటింగ్ కొద్దిసేటి క్రితం అధికారికంగా ప్రారంభమైంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ముహూర్తపు షాట్ కు దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అశుతోష్ రాణాలతో పాటు పంజాబ్ చిత్ర సీమలో టాప్ హీరోగా ఉన్న నటుడు విలన్ గా నటించనున్నాడు.

ఇక ఈ చిత్రానికి 'రెడ్డిగారు' అన్న టైటిల్ ను పెట్టనున్నారని వార్తలు రాగా, ఇప్పుడు 'జయసింహ' అన్న పేరు వినిపిస్తోంది. చిత్ర ప్రారంభోత్సవానికి డైరెక్టర్ క్రిష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అంబిక కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ, నెలాఖరు వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో, ఆపై తమిళనాడులోని కుంభకోణంలో షూటింగ్ చేస్తామని, ఆ తరువాత వైజాగ్, హైదరాబాద్ లో సినిమాను పూర్తి చేసి, సంక్రాంతి బరిలో నిలుపుతామని అన్నారు.

  • Loading...

More Telugu News